పర్ఫెక్ట్ ఫ్లేవర్ “మటన్ మసాలా కర్రీ” – ఇలా చేస్తే ప్రతి ముక్క మెత్తగా ఉడుకుతుంది

మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. పెళ్లిళ్లలో మటన్ కర్రీ గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే తాజా మసాలాలకు తోడు ఉల్లిపాయలు గ్రైండ్ చేసి వేస్తుంటారు. కానీ, ఉల్లిపాయలు సన్నగా తరిగి నూనెలో బాగా వేయించి చేసే మటన్ మసాలా కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన విధంగా ఓ సారి కుక్కర్​లో మటన్ మసాలా కర్రీ ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉండటమే కాదు! ప్రతి ముక్క మెత్తగా ఉడుకుతుంది.


కావల్సిన పదార్థాలు :

  • మటన్ – అర కేజీ
  • నూనె – 4 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర – అర స్పూన్
  • యాలకులు – 2
  • లవంగాలు – 3
  • బిర్యానీ ఆకులు – 2
  • ఉల్లిపాయలు – 3
  • ఉప్పు – తగినంత
  • పసుపు – పావు స్పూన్
  • కారం – 2 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి – 3
  • పుదీనా – కొద్దిగా
  • కొత్తిమీర – కొద్దిగా
  • పెరుగు – పావు కప్పు
  • మసాలా కోసం :

    • మిరియాలు – అర స్పూన్
    • ధనియాలు – 1 టేబుల్ స్పూన్
    • జీలకర్ర – అర స్పూన్
    • పెద్ద యాలకులు – 2
    • లవంగాలు – 3
    • ఉప్పు – కొద్దిగా
    • కసూరి మేతి – 1 స్పూన్
    • తయారీ విధానం :

      • స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడెక్కగానే జీలకర్ర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ వేసి ఫ్రై చేసుకోవాలి.
      • మటన్ రంగు మారిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకుని కలపాలి. ఐదారు నిమిషాలు ఉడికించిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసుకుని కలపాలి.
      • మరో మూడు నిమిషాలు ఉడికిన తర్వాత నూనె తేలినపుడు ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకుని కుక్కర్​ మూత పెట్టుకోవాలి. ఇపుడు 5విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకోవాలి.
    • ఇపుడు ఓ కడాయిలోకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పెద్ద యాలకులు, లవంగాలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. మసాలాతో పాటు ఉప్పు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి.
    • ఇపుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకుని రెడీ చేసుకున్న మసాలా పొడి వేసుకుని కలపాలి. ఇపుడు మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుని చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు, కసూరి మేతి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు! ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.