పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు – ముహూర్తం

ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పథకం అమలుకు సిద్దం అయింది. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతీ రైతుకు ఏడాదికి రూ 20 వేల ఆర్దిక సాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ నెలలోనే ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో రూ 20 వేలు జమ కానున్నాయి. ఇక, పీఎం కిసాన్ 20వ విడతకు సంబధించిన నిధులను ఈ నెలలోనే విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంటే ఈ నెలలో రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంది. 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ – జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనున్నారు.

ఈ కేవైసీ ద్వారా జూన్​లో విడుదలయ్యే పీఎం కిసాన్ 20వ విడత నిధులు అకౌంట్​లో పడాలంటే ఈ మూడు పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మొదటిది e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. అదే వధంగా బ్యాంక్​అకౌంట్​ను ఆధార్​తో అనుసంధానించాలి. మూడోవది భూమి రికార్డుల వివరాలను ధృవీకరిం చాలి.​మొదట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in వెళ్లి ఈ-కేవైసీ ఆప్షన్​పై క్లిక్​చేయండి. మీ ఆధార్​నంబర్​ను ఎంటర్​చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్​నంబర్​కు ఓటీపీ వస్తుంది, దానిని సబ్మిట్ చేయండి. సమీపంలోని కామన్​సర్వీస్​సెంటర్​(CSC) సెంటర్​కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. అయితే దీన్ని 2025 మే 31 నాటికి పూర్తి చేసి ఉండాలని పీఎం కిసాన్ అధికారిక విభాగం వెల్లడించింది.

ఇలా చేయండి పేమెంట్​స్టేటస్​చెక్​చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి. రిజిస్ట్రేషన్​వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్​చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు Get OTP ఆప్షన్​పై క్లిక్​చేస్తే మీ మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్​చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ – కేవైసీ చేయించలేదన్నట్లుగా భావిస్తారు. దీంతో, ప్రతీ లబ్దిదారుడికి ఈ విధానం తప్పని సరి చేసారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.