రైతులకు సాయం అందించేకు కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి రూ.6 వేల జమ చేస్తారు.
నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 16 విడతలుగా రూ.32 వేలను అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. త్వరలో పీఎం కిసాన్ యోజన 17వ విడత విడులయ్యే అవకాశం ఉంది.
లోక్ ఎన్నికల తర్వాత 17వ విడత విడుదల చేసే అవకాశం ఉంది. 16వ విడత గత మార్చి 28వ తేదీ బుధవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేసింది. కాగా.. ఇప్పుడు 17వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిఎం కిసాన్ యోజన 16వ విడత ఫిబ్రవరిలో విడుదలైనప్పటి నుండి ప్రభుత్వం త్వరలో 17వ విడత తేదీని ప్రకటిస్తుందని భావిస్తున్నారు.
పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఇ కేవైసీని తప్పనిసరి చేశారు. ఓటీపీ ఆధారిత e kyc పీఎం కిసాన్ యోజన పోర్టల్ లోనే చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీప సీఎస్సీ, మీ సే కేంద్రాలను సంప్రదించవచ్చు. లబ్దిదారుల జాబితా కూడా పోర్టల్ లో చూసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ‘ఫార్మర్స్ కార్నర్’ పై క్లిక్ చేయాలి. ఫార్మర్స్ కార్నర్ విభాగంలో, లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేయాలి. డ్రాప్-డౌన్ జాబితా నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి. ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయగానేలబ్ధిదారుల పూర్తి జాబితా కనిపిస్తుంది. దీనిలో మీరు మీ పేరును చెక్ చేసుకోవచ్చు. ఏదైనా సందేహం లేదా సహాయం కోసం, లబ్ధిదారులు PM-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్-1555261, 1800115526 లేదా 011-23381092ను సంప్రదించవచ్చు.