Richest Prisoner: ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?

ప్రపంచ కుబేరుల గురించి ఇప్పటివరకు విన్నాం. కానీ, అత్యంత ధనిక ఖైదీ (Richest Prisoner) గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన మరెవరో కాదు క్రిప్టో కరెన్సీ (crypto currency) సంస్థ బినాన్స్‌ (Binance) వ్యవస్థాపకుడు చాంగ్ జావో (Changpeng Zhao). ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అసలు ఆయన జైలుకు వెళ్లడానికి గల కారణమేమిటంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మనీలాండరింగ్‌ నిరోధక, ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్‌జావోను గతేడాది అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు కనీసం మూడు ఏళ్ల జైలు శిక్షను విధించాలని న్యాయవాదులు కోరినా.. జావో ప్రవర్తనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన నాలుగు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. చాంగ్‌జావో 2017లో బినాన్స్‌ను స్థాపించారు. దీంతో కొన్నేళ్లలోనే ఆయన బిలియనీర్‌గా ఎదిగారు. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.

అమెరికా అధికారులతో చేసిన ఒప్పందంలో భాగంగా జావో బినాన్స్‌ సీఈఓ బాధ్యత నుంచి గతేడాది వైదొలిగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90 శాతం వాటా ఉంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం.. జావో సంపద విలువ సుమారు 43 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3.60 లక్షల కోట్లు). ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కూలిపోవడంతో సంస్థ నష్టాలు చవిచూసింది.

ఈ క్రమంలోనే జావో ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన నేరం వెలుగులోకి వచ్చింది. ఆయన అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ల ఫండ్‌ల నుంచి బిలియన్‌ డాలర్లను మాయం చేసినట్లు విచారణలో తేలింది. జావో దోషిగా రుజువుకావడంతో అతనికి నాలుగు నెలల జైలు శిక్ష ఖరారైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *