ఏపీ పాలిసెట్ -2025 ఫలితాలు వచ్చేశాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు. ఈ క్రమంలో పాలిసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి లోకేశ్ అభినందించారు. ఏపీ వ్యాప్తంగా 1, 39,749 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాయగా 1,33,358 మంది అభ్యర్థులు(95.36 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ పాలిసెట్ -2025 ఫలితాలు వచ్చేశాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారు. ఈ క్రమంలో పాలిసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి లోకేశ్ అభినందించారు. వారి అద్భుతమైన కృషి ప్రశంసిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అయితే polycetap.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ఆయన తెలిపారు. దీనిలో పాటు మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు ‘hi’ పంపి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశం కోసం ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించబడింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,57,482 మంది అప్లై చేసుకోగా.. అందులో 1, 39,749 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు. కాగా ఇందులో 1,33,358 మంది విద్యార్థులు (95.36 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అయితే పాలిసెట్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 98.66శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేష్ తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
ఇక ఇప్పుడు పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో డిప్లొమా కోర్పుల్లో ప్రవేశాలు పొందుతారు. అయితే ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించబడుతాయి.