ఏపీలో ‘పవర్ స్టార్ విస్కీ’..వైసీపీ, కూటమి మధ్య వార్..!

ఏపీలో 999 పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో కొత్త విస్కీ వచ్చింది. దీనిపై వైసీపీ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం ‘పవర్ స్టార్ విస్కీ’ పేరుతో కొత్త బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది.


నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్‌ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన స్పందించి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రాగోల్డ్, బూమ్ బూమ్, 999 పవర్ స్టార్ బ్రాండ్ మద్యం తీసుకొచ్చింది వైఎస్ జగనే అని ఆరోపించారు. జగనే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుండి..ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను వైఎస్ జగన్ తీశారని దుయ్యబట్టారు . ఈ బ్రాండ్‌లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి.