KGF 3పై ప్రశాంత్ నీల్ క్రేజీ అప్​డేట్.. ఇది మామూలు ప్లానింగ్ కాదు!

www.mannamweb.com


‘కేజీఎఫ్సిరీస్ ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోని విజువల్స్, యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేషన్ సీన్స్​కు సౌత్​తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ సిరీస్​తో పాన్ ఇండియా రేంజ్​లో హీరో యష్ గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అందరి ఫేవరెట్ అయిపోయారు. సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్​ప్లేతో మాస్ హీరోయిజం సీన్స్​తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరుకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. యష్ నటన, నీల్ టేకింగ్​తో పాటు సినిమాకు మ్యూజిక్​ కూడా ప్రాణం పోసింది. బాలీవుడ్​లోనూ వసూళ్ల పండుగ చేసుకున్న ‘కేజీఎఫ్’ సిరీస్ నుంచి నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కేజీఎఫ్​ 2’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్​తో ‘సలార్’ తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. దీని తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో ఓ మూవీని రూపొందించాల్సి ఉంది. ఇలా పలు కమిట్​మెంట్స్​తో ఆయన బిజీగా ఉండటంతో ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో రాకపోవచ్చని అంతా భావించారు. అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ‘కేజీఎఫ్’ మూడో పార్ట్​ను తెరకెక్కించాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని అనుకున్నారు. కానీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్ 3’పై ఇంట్రెస్టింగ్ అప్​డేట్ ఇచ్చారు. మూడో పార్ట్​కు సంబంధించిన స్క్రిప్ట్ తన వద్ద రెడీగా ఉందన్నారు. స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయిందన్నారు.

స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టే ‘కేజీఎఫ్ 2’ ఎండింగ్​లో పార్ట్ 3 గురించి ‘కేజీఎఫ్ 3’ అనే టైటిల్ పెట్టామన్నారు ప్రశాంత్ నీల్. తన కెరీర్​లో ఇప్పటివరకు పలు సినిమాలు చేశానని.. అన్నీ బిగ్ బడ్జెట్ మూవీస్ అని అన్నారు. అయితే వీటన్నింటి కంటే ‘కేజీఎఫ్ 3’ అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతుందని తెలిపారు. ఈ వార్త విన్న యష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ హీరోను మళ్లీ ‘కేజీఎఫ్​’లో రాకీ భాయ్​గా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్నారు. ఇక, ‘కేజీఎఫ్ 2’ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్.. ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా చుట్టూ జరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. మరి.. యష్ ‘కేజీఎఫ్ 3’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.