ధర రూ. 70 వేలు, మైలేజ్‌ 73 కిలోమీటర్లు.. ఊహకందని ఫీచర్లతో బైక్‌

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బైక్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలా మంది కోరుకునేది ఒకటే. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ ఇవ్వాలి. ఇలాంటి బైక్స్‌కి మొగ్గు చూపుతుంటారు. అయితే అలాంటి జాబితాలోకే వస్తుంది టీవీఎస్‌ రేడియన్‌ బైక్‌. ఇంతకీ ఈ బైక్‌ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


టీవీఎస్‌ రేడియన్‌ బైక్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. బేస్‌ ఎడిషన్‌, డిజి డ్రమ్‌, డిజి డిస్క్‌ అనే మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఎక్స్‌షోరూమ్‌ ధరల విషయానికొస్తే వరుసగా రూ. 59,880, రూ. 77,394, టాప్‌ వేరియంట్‌ ధర రూ. 81,394గా ఉంది. ఈ బైక్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే డెలివరీ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

టీవీఎస్‌ రేడియన్‌ డిజి ఎడిషన్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 80,350కాగా భారీగా డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ బైక్‌ను సుమారు రూ. 72 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక సులభమైన ఈఎమ్‌ఐ ఆప్షన్స్‌లో కూడా ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 3500 చొప్పున ఈ బైక్‌ను పొందొచ్చు.

ఈ బైక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఫ్రంట్‌ బ్రేక్ డ్రమ్‌ను అందించారు. అలాగే ఈ బైక్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ 109.7 సీసీగా ఉంది. ఇంజన్‌ 7350 ఆర్‌పీఎమ్‌ వద్ద 8.18 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్‌ ఆడో మీటర్‌ను అందించారు. ఇంతక తక్కువ ధరలో డిజిటల్‌ ఆడో మీటర్‌ను అందించడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో 109.7 సీసీ ఇంజన్‌ను ఇచ్చారు. రియల్‌ టైమ్‌ మైలేజ్‌ డిస్‌ప్లే ఈ బైక్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. దీంతో మీ దగ్గర ఉన్న ఫ్యూయల్‌తో ఎంత దూరం ప్రయాణించవచ్చో సులభంగా తెలుసుకోవచ్చు.

టెక్నాలజీకి కూడా ఈ బైక్‌లో పెద్ద పీట వేశారు. ఇందులో యూఎస్‌బీ ఛార్జర్‌ను ఇచ్చారు. ఇక డిస్క్‌ బ్రేక్‌, లాంగ్‌ సీట్, అలాయ్‌ వీల్స్‌ను అందించార. 4 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఈ బైక్‌ సొంతం. ఇందులో ట్యూబ్‌లెస్‌ టైర్లను అందించారు. ఈ బైక్‌ ఫ్యూయల్‌ కెపాసిటీ 10 లీటర్లుగా కాగా 2 లీటర్ల రిజర్వ్‌ ట్యాంక్‌ను ఇచ్చారు. ఈ బైక్‌ గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ఈ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌ను ఇచ్చారు. 12 వీ బ్యాటరీ ఈ బైక్‌ సొంతం. డైమెన్షన్స్‌ విషయానికొస్తే 2025 ఎమ్‌ఎమ్‌ లెంగ్త్‌, 705 ఎమ్‌ఎమ్‌ విడ్త్‌, 1080 ఎమ్‌ఎమ్‌ హైట్‌ను ఇచ్చారు. వీల్‌ బేస్‌ 1265 ఎమ్‌ఎమ్‌గా ఉంటుంది. 180 ఎమ్‌ఎమ్‌ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఈ బైక్‌ సొంతం. 780 ఎమ్‌ఎమ్‌తో కూడిన పొడవాటి సీటు ఈ బైక్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ బైక్‌ 4500 ఆర్‌పీఎమ్‌ వద్ద 8.7 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.