ఆ బ్రాండ్ బీరు ధరలు తగ్గుతున్నాయి.

నడి వేసవిలో మందుబాబులకు గుడ్ న్యూస్. బీర్ల ధరలు తగ్గనున్నాయి. అయితే అవి కొన్ని బ్రాండ్లకే పరిమితం కానున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మందుబాబులు చల్లటి బీర్లను తాగుతూ సేద తీరుతున్నారు. ఇటువంటి సమయంలోనే బీర్ల ధరను తగ్గించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. మరోవైపు భారత్, బ్రిటన్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం వల్ల బీర్ ధరలు తగ్గనున్నాయి. నిజంగా ఇది మందుబాబులకు శుభవార్త. సాధారణంగా వేసవిలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే కంపెనీలు ధరను తగ్గించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


* ఐదు రకాల బీర్లపై..
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రకాల ప్రధాన బీర్ బ్రాండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. రూ.99 బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత బీర్ల అమ్మకాలపై ఆ ప్రభావం పడింది. అయితే వేసవిలో ఎక్కువగా బీర్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. తాజాగా భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల.. బ్రిటన్ బీరు పై ఉన్న 75% పన్నును తగ్గించింది. దీంతో ఆ దేశంలో తయారయ్యే బీర్ల ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడ్డాయి. తాజా ఒప్పందంతో బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇండియాలో చాలా చౌకగా మారుతాయి. బ్రిటన్ బీర్ తో పాటు అక్కడి స్కాచ్, విస్కీ పై కూడా పన్ను తగ్గించారు. దీంతో తక్కువ ధరకే ఇండియాలో లభించనున్నాయి.

* ఒక్కో బీరు రూ.30 తగ్గుదల..
ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న బీర్లు 250 రూపాయల వరకు పలుకుతున్నాయి. బ్రిటన్ తో ఒప్పందం నేపథ్యంలో ఒక్కో బీరు పై 20 నుంచి 35 రూపాయల వరకు ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. 2024లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఉండేది. ఇది ఏడాదికి సగటున ఎనిమిది నుంచి పది శాతం వృద్ధిరేటు పొందుతూ వస్తోంది. కేంద్రం ఒప్పందం చేసుకున్నా.. ప్రతి రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ.. వ్యాట్ పన్నును ఖరారు చేస్తుంది. అయితే ఇలా ఎలా చేసినా యూకే బ్రాండ్ బీర్ల ధరలు మాత్రం తగ్గించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.