సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చక్కర్లు

సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చక్కర్లు


హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్ ఆంజనేయులు యత్నించారు. అపాయింట్‌మెంట్‌ లేదని సీఎంవో అధికారులు చెప్పినా హైదరాబాద్‌లోని సీఎం ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టారు.

ఆదివారం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండుసార్లు అక్కడికి వెళ్లారు. అపాయింట్‌మెంట్ లేకపోవడంతో సీఎం ఇంటి గేటుదగ్గరే పీఎస్‌ఆర్‌ను భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైకాపా కోసం పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.