జూన్ 6న భారత ప్రభుత్వం జాతీయ సెలవు దినం(Public Holiday) ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
రేపు ఎలాంటి పబ్లిక్ లేదంటూ ప్రకటించింది. ఈ ఫేక్ ప్రచారంపై వచ్చిన వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఖండించింది. దేశంలోని బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జూన్ 6న మూతపడతాయని పలు సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం జరిగింది. కాగా అలాంటిదేం లేదని, తప్పుడు వార్తలను నమ్మొద్దని PIB పేర్కొంది.
కేరళలో జూన్ 6న బక్రీద్ సెలవుగా ప్రకటించినప్పటికీ దానిని జూన్ 7కు మార్చింది కేరళ ప్రభుత్వం. కొచ్చి, తిరువనంతపురంలోని కొన్ని బ్యాంకులకు మాత్రం రేపు హాలిడే ఉంటుందని RBI పేర్కొంది. కాని దేశవ్యాప్త హాలిడే మాత్రం లేదని ఫ్యాక్ట్ చెక్ సంస్థ అధికారిక ప్రకటన జారీ చేసింది.

































