“కజ్జికాయ” తయారు చేయడానికి ఒక కొత్త మార్గం

 కజ్జికాయలు చాలా మంది ఫెవరేట్ స్వీట్ రెసిపీలలో ఒకటి. వీటినే కొన్ని ప్రాంతాల్లో గర్జలు, గుజియా అని కూడా అంటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా ఉండే కజ్జికాయలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ, కొంతమందికి ఇవి పైన క్రిస్పీగా రాకుండా మెత్తగా, పర్ఫెక్ట్ షేప్​లో రావు. అలాగే, స్వీట్​నెస్ తక్కువ కావడమో జరుగుతుంటుంది. అలాంటివారు ఓసారి ఈ స్టైల్​లో “కజ్జికాయలు” చేసుకొని చూడండి. కజ్జికాయల పీట లేకున్నా ఈ చిన్న ట్రిక్​తో చాలా తక్కువ టైమ్​లో మరొకరి సహాయం లేకుండా ఎక్కువ మొత్తంలో రెడీ చేసుకోవచ్చు. పైన లేయర్ క్రిస్పీగా వచ్చి, మంచి స్టఫింగ్​తో ఎంతో రుచికరంగా ఉండే వీటిని ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. మరి, ఈ సూపర్ టేస్టీ కజ్జికాయలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

పిండి కోసం :

  • మైదా – రెండు కప్పులు
  • సన్నని బొంబాయి రవ్వ – పావు కప్పు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నెయ్యి – మూడు టేబుల్​స్పూన్లు
  • నూనె – వేయించడానికి తగినంత
  • స్టఫింగ్ కోసం :

    • నెయ్యి – మూడు టేబుల్​స్పూన్లు
    • డ్రైఫ్రూట్స్ తరుగు – పావుకప్పు
    • బొంబాయి రవ్వ – అర కప్పు
    • ఎండుకొబ్బరి తురుము – ఒక కప్పు
    • యాలకుల పొడి – ఒకటీస్పూన్
    • పంచదార – ముప్పావు కప్పు
    • తయారీ విధానం :

      • ఈ రెసిపీ కోసం ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సింగ్ బౌల్​లో మైదా పిండిని తీసుకొని ఆపై అందులో సన్నని బొంబాయి రవ్వ, రుచికి తగినంత ఉప్పు, నెయ్యి వేసుకొని అది పిండికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
      • తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని నీటిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ సెమి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని మూతపెట్టి పావుగంట పాటు పక్కనుంచాలి.
      • అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్​స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ తరుగు(జీడిపప్పు, బాదం, పిస్తా) వేసుకొని లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
      • అవి కాస్త వేగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని అది మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
      • ఆ తర్వాత సన్నని ఎండుకొబ్బరి తురుము, ఒక టేబుల్​స్పూన్ నెయ్యి జత చేసుకొని కొబ్బరి కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు సన్నని సెగ మీద వేయించుకోవాలి.
      • ఎండుకొబ్బరి మాడిపోకుండా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని దించే ముందు యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి.
    • ఇప్పుడు మిక్సీ జార్​లో పంచదార తీసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ముందుగా వేయించి తీసుకున్న కొబ్బరితురుము మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే ‘స్టఫింగ్’ రెడీ అయిపోతుంది.
    • అనంతరం పావుగంట పాటు పక్కనుంచిన పిండి ముద్దను తీసుకొని మరోసారి బాగా కలిపి దాన్ని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి.
    • తర్వాత పెద్ద చపాతీ పీట లేదా శుభ్రమైన కిచెన్ ఫ్లాట్​పారమ్​ మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఒక పిండి తీసుకొని చపాతీ రోలర్​తో ఎంత వీలైతే అంత ఈవెన్​గా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • పిండి ఉండను పెద్ద వెడల్పాటి చపాతీలా చేసుకొని దానిపై ఏదైనా అంచులు షార్ప్​గా ఉండే బాక్సు మూతతో కాస్త వత్తినట్లు ప్రెస్ చేస్తే(ఫొటోలో చూపిస్తున్నవిధంగా) రౌండ్ పూరీలా వస్తుంది.
  • అలా వీలైనన్ని వత్తుకొని ఎక్స్​ట్రా పిండిని తీసేసుకొని మిగిలిన పిండిలో ముద్దలో వేసుకొని కలుపుకోవాలి.
  • నార్మల్​గా చాలా మంది చిన్న చిన్న పిండి ఉండలతో చపాతీలా చేసుకొని అందులో స్టఫింగ్ ఉంచి కజ్జికాయలు చేసుకుంటారు. ఇలా చేసుకుంటే కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. కానీ, అదే పైన చెప్పిన చిన్న ట్రిక్​తో తక్కువ టైమ్​లో ఎక్కువ కజ్జికాయలను రెడీ చేసుకోవచ్చు.
  • అనంతరం అలా ప్రిపేర్ చేసుకున్న ఒక్కో పూరీ షీట్​పై తగినంత స్టఫింగ్ వేసుకొని ఆపై అంచుల వెంట కాస్త వాటర్ తడిచేసుకొని ఫోల్డ్ చేసుకొని అంచులు ఊడకుండా కాస్త ప్రెస్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వాటికి షేప్ ఇవ్వడం కోసం ఫోర్క్ చెంచాతో ఫొటోలో చూపిస్తున్న విధంగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది.
  • ఇదే ప్రాసెస్​లో పిండి మొత్తాన్ని కజ్జికాయల మాదిరిగా చేసుకొని ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను పాన్​లో సరిపడినన్ని వేసుకొని రెండు వైపులా లైట్​గా వేయించాలి.
  • ఆ తర్వాత మీడియం ఫ్లేమ్​లోకి మార్చి రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ కలర్​లోకి వచ్చాక టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సూపర్ టేస్టీగా కరకరలాడే “కజ్జికాయలు” మీ ముందు ఉంటాయి!
  • చిట్కాలు :

    • ఇక్కడ మీరు మైదా పిండి వద్దనుకుంటే దాని ప్లేస్​లో గోధుమపిండిని అయినా తీసుకోవచ్చు.
    • ఒకవేళ బొంబాయి రవ్వ కాస్త లావుగా ఉంటే మిక్సీ జార్​లో వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకొని వాడుకోవాలి.
    • బొంబాయి రవ్వ వేసుకోవడం ద్వారా కజ్జికాయల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది.
    • కజ్జికాయలను సీల్ చేసుకునేటప్పుడు అవి ఊడిపోకుండా వత్తుకోవాలి. లేదంటే, ఆయిల్​లో వేసుకున్నప్పుడు స్టఫింగ్ నూనెలోకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.