ఇప్పటికే అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవులకు రుతుపవనాలు తాకాయి. ఈనెల 27న రుతుపవనాలు కేరళకు తాకనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ ఈ తీపి కబురు అందించింది.
ఏపీలో( Andhra Pradesh) వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రానున్న వారం రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్య సాయి, అనంతపురం, వైయస్సార్ కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతోనే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు చురుగ్గా కదలికతోనే ఇలా వాతావరణం మారిందని సంకేతాలు వస్తున్నాయి.
* చురుగ్గా రుతుపవనాలు..
ఇప్పటికే అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవులకు రుతుపవనాలు తాకాయి. ఈనెల 27న రుతుపవనాలు కేరళకు తాకనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ ఈ తీపి కబురు అందించింది. ఇప్పటికే ఎండల తీవ్రతతో ఏపీ వ్యాప్తంగా మండిపోతుంది. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడడంతో పాటు వర్ష సూచన ఉండడంతో ప్రజలు సేదతీరుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి హెచ్చరిక వచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
* ఆ జిల్లాలకు అలర్ట్
రానున్న వారం రోజులు పాటు ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ( Vishakha ) వాతావరణ కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. మరోవైపు రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఈ తరుణంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. మరోవైపు బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైయస్సార్ కడప జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ఏపీలో ప్రవేశిస్తాయి. అయితే ఈసారి దేశవ్యాప్తంగా ముందుగానే ప్రవేశించడంతో వాటి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. వాస్తవానికి ఏటా మే 20 తర్వాత అండమాన్ కు రుతుపవనాలు ఎంట్రీ కావడం సర్వసాధారణంగా వస్తోంది. ఈసారి ముందుగానే పలకరించడం నిజంగా విశేషం. జూన్ మొదటి వారంలో ఏపీవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.