సింగల్ స్క్రీన్ థియేటర్స్ మన దేశంలో ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో సింగల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. మన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని కూల్చి వేసి ఆ స్థానంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ లేదా మాల్స్ ని నిర్మిస్తున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొత్తం మీద ఒక్క సింగల్ స్క్రీన్ కూడా లేని ప్రాంతం ఏదైనా ఉందా అంటే, అది నెల్లూరు మాత్రమే. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే నెల్లూరు సిటీ ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ కి మాత్రమే పరిమితమైంది. నెల్లూరు బాటలోనే ఇప్పుడు చెన్నై కూడా నడుస్తుంది. ఇప్పటికే చెన్నై లో ఎన్నో ప్రఖ్యాత సింగల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. ఈమధ్య కాలం లో ఇది ఆ ప్రాంతంలో రొటీన్ అయిపోయింది.
ఇప్పటికే ఈ సిటీ లో అగస్త్య, కామధేను, కృష్ణ వేణి వంటి పాపులర్ థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పుడు రజినీకాంత్(Superstar Rajinikanth) థియేటర్ అని పిలవబడే బృందా థియేటర్(Brindha Theatre) కూడా మూతపడింది. ఉత్తర చెన్నై లో ల్యాండ్ మార్క్ గా పిలవబడే బృందా థియేటర్ ని 1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజినీకాంత్ చేతులమీదుగా ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి ఈ థియేటర్ ని అందరూ రజినీకాంత్ థియేటర్ అని పిలిచేవారు. ఇక్కడ రజినీకాంత్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సిల్వర్ జూబ్లీలు పూర్తి చేసుకున్నాయి. అలాంటి థియేటర్ మొన్న సోమవారం నుండి ప్రదర్శనలు నిలిపేసింది. ఒక ప్రైవేట్ సంస్థకు ఈ థియేటర్ ని అమ్మేసారు. త్వరలోనే ఈ థియేటర్ ని కూల్చేసి, దాని స్థానంలో ఒక భారీ అపార్ట్మెంట్స్ ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారట. తమిళనాడు ప్రేక్షకులకు, ముఖ్యంగా రజినీకాంత్ అభిమానులకు ఈ థియేటర్ ద్వారా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి.
థియేటర్స్ ఇలా మూత పడడానికి ప్రధాన కారణం జనాలు థియేటర్స్ కి రావడం తగ్గిపోవడం వల్లే. స్టార్ హీరోల సినిమాలు రెగ్యులర్ గా విడుదల అవుతూ ఉండకపోతే రాబోయే రోజుల్లో మనం వందల సంఖ్యలో థియేటర్స్ కూలిపోవడాన్ని చూడొచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి నాలుగు వచ్చేవి. కానీ ఇప్పుడు మూడేళ్లకు ఒకటి వస్తుంది. స్టార్ హీరోల సినిమాలు వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్స్ కి కదులుతారు. వాళ్ళ సినిమాలు హిట్ అయితే మూత పడిన థియేటర్స్ ని కూడా మళ్ళీ తెరిచి ప్రదర్శిస్తారు. రీసెంట్ గా అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు అయినా వదిలితే థియేటర్స్ బ్రతుకుతాయి. మన టాలీవుడ్ లో ఆరు మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ తమిళనాడు లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన ఈ ఇద్దరే ఆ ఇండస్ట్రీ ని కాపాడా
































