In Pics: సీఎం జగన్ నివాసంలో 41 రోజులుగా రాజశ్యామల యాగం, నేడే పూర్తి – ఫోటోలు

సీఎం జగన్ శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు.
తాడేపల్లిలోని జగన్ నివాసంలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో ఈ చండీయాగం జరిగింది.
శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్ కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం అందించారు.


బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం నిర్వహించారు.

చండీయాగం, రాజశ్యామల యాగం వంటివి చేసేవారు.. రాష్ట్ర క్షేమం, ప్రజా సంక్షేమం కాంక్షించి ఈ యాగం చేస్తుంటారని చెబుతారు.

గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరచూ ఈ యాగం చేసేవారు.
గత ఫిబ్రవరి నెలలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.

ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా మండలం రోజులు అంటే 41 రోజులు చేయడానికి వీలుంటుంది. లేదా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా వీలును బట్టి చేస్తుంటారు.