Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న 6 గ్యారంటీలను పొందాలంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో నేటికీ చాలామందికి రేషన్ కార్డు లేదు.
దీంతో చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్ల రేషన్ కార్డు లేని అర్హులను గుర్తించి తెల్ల రేషన్ కార్డ్ జారీ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోని అధికారుల ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే 15 తర్వాత నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Ration Cards : వీరికి నో రేషన్ కార్డు….
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ,ప్రభుత్వ ఉద్యోగులకు , కారు ఉన్న వారికి గృహ యజమానులు మరియు నిర్దిష్ట క్యాటగిరీలకు చెందిన వ్యక్తులకు కొత్త రేషన్ కార్డ్ ఇవ్వబడదని ప్రభుత్వం విశ్వసనీయంగా సూచించింది.
Ration Cards : కొత్త రేషన్ కార్డు ప్రక్రియ..
రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకి చాలా కీలకమైనటువంటి కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు జారీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న పక్కా ప్రణాళికలను తెలియజేస్తూ కీలక నిర్ణయాలను వెల్లడించింది.
అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా దరఖాస్తులు స్వీకరించారు. దీనిలో భాగంగా సుమారు 10 లక్షల మంది వ్యక్తులు వివిధ పథకాల కోసం దరఖాస్తు తో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు.
Ration Cards : సంక్షేమ లక్ష్యంపై దృష్టి…
రేషన్ కార్డులను నిర్దిష్ట సామాజిక మరియు ఆర్థిక విభాగాలకు చెందిన వారికి అందించాలనేది ప్రభుత్వ నిర్ణయం. రైతులు మరియు కార్మికుల వంటి బలహీన వర్గాలకు చెందిన వారికి ఈ తెల్ల రేషన్ కార్డులో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా ఖచ్చితమైన పరిశీలన మరియు ధృవీకరణ విధానాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి మే 15 తర్వాతకొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం… వారికి నో రేషన్ కార్డు…!
Ration Cards : సంక్షేమ పథకాలకు ప్రాముఖ్యత…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్లు మాత్రమే పొందగలుగుతారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ గృహాలు ,సబ్సిడీ కింద 500 కే గ్యాస్ సిలిండర్లు ఇలా అవసరమైన సేవలు అన్నింటికీ ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.