ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. మే 24 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చునని విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా రూ.550 చెల్లించాలని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు రూ.250, బ్రిడ్జి కోర్సు సబ్జెక్ట్‌కు రూ.150 చెల్లించాలని వివరించారు. అదేవిధంగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు కూడా ఈ తేదీల్లోనే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీ కౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంటు రాయాలనుకుంటే రూ.1100 చెల్లించాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షకు రూ.500, బ్రిడ్జి కోర్సుకు రూ.300 అని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి ఇంప్రూవ్‌మెంటు రాయాలనుకుంటే ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240, సైన్స్ విద్యార్థులు రూ.1440 చెల్లించాలని వివరించారు.