జేఈఈ అడ్వాన్స్‌డ్ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌(JEE Advanced 2025) పరీక్ష రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్‌. దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్ష రెస్పాన్స్‌ షీట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18న పరీక్ష నిర్వహించిన ఐఐటీ కాన్పూర్‌ అధికారులు.. తాజాగా విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి రెస్పాన్స్‌ షీట్లు పొందొచ్చు.


మే 18న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో ఈ పరీక్షలు జరిగాయి.  ప్రాథమిక కీని మే 26న విడుదల చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 2న తుది కీ, ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.