రెండో జాబితా విడుదల…..వారందరి ఖాతాలో రూ.13వేలు జమ…మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకం’తల్లికి వందనం పథకం’. ఈ తల్లికి వందనం పథకం రెండో జాబితా విడుదలైంది.


గత నెలలో తొలిజాబితా విడుదలై అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో రూ.13వేలు నగదు జమ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అర్హత కలిగి ఉండి సాంకేతిక లోపాల కారణంగా నగదు జమ కానివారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో జూన్ 26వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అర్హత కలిగిన లబ్ధిదారుల గ్రీవెన్స్‌ను పరిశీలించిన అధికారయంత్రాంగం జూన్ 30న రెండోజాబితా విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో జాబితా విడుదల అయ్యింది. ఇకపోతే రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.13,000/- విద్యార్థి యొక్క తల్లి అకౌంట్‌లో నగదు జమకానున్నాయి. అయితే అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు వారి యొక్క పేర్లు రెండవ జాబితాలో ఉన్నాయా? లేదా తెలుసుకోవడానికి ఏమి చేయాలి? ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి? అనేది తెలుసుకుందాం.

రెండో జాబితా విడుదల
తొలివిడతలో తల్లికి వందనం స్కీం కింద నగదు జమ కాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 26 వరకు ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరించింది. జూన్ 28 వరకు గ్రీవెన్స్‌లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించింది. అనంతరం 30న అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో అర్హత పొందినవారి విద్యార్థుల తల్లిదండ్రుల జాబితాలో జూలై 5 వరకు నగదు జమ అవుతాయి. మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు సంప్రదించి, రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
మీ పేరు ఉన్నట్లయితే మీకు డబ్బులు డిపాజిట్ అవుతాయి. మరోవైపు గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో కూడా లిస్టు పెడతారు. చెక్ చేయవచ్చు.

డబ్బులు ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:

రెండవ విడత జాబితాలో పేరు ఉన్నవారికి ₹13,000/- జూలై 5వ తేదీలోపు అర్హులైన తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో నేరుగా డిపాజిట్ అవుతాయి.
మొత్తం ₹15,000/- లలో ₹13,000/- డిపాజిట్ చేస్తారు. మిగిలిన ₹2,000/- పాఠశాల మెయింటినెన్స్ కోసం కట్ చేస్తారు

ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే…
>> తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి… అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckPకి వెళ్లాలి.
>> అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.
>> అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.
>> ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే… లింక్ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
>> ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే…

ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు సేవలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం స్టేటస్ కూడా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009 నంబర్‌కు ”Hi” అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి… డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి… నిర్దారించండి మీద క్లిక్ చేయాలి. తద్వారా మీరు తల్లికి వందనం స్టేటస్ తెలుసుకుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.