రిటైర్మెంట్‌ వయసు పెంపుపై రగడ

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయోపరిమితి పెంపు రగడకు దారి తీస్తున్నది. వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పదమవుతున్నది.


12 వర్సిటీలకే వర్తింపజేసిన ప్రభుత్వం
తమకూ అవకాశమివ్వాలంటున్న వెటర్నరీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ ప్రొఫెసర్లు
సర్కారు తీరును వ్యతిరేకిస్తున్న ఆచార్యులు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయోపరిమితి పెంపు రగడకు దారి తీస్తున్నది. వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పదమవుతున్నది. ఇటీవల ప్రభుత్వం ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయోపరిమితిని 60 నుంచి 65 ఏండ్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఇది కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేసి అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫారెస్ట్‌ వర్సిటీలను మినహాయించారు. దీంతో తాము ఏం అన్యాయం చేశామని, తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

2021 నుంచి వర్తింపజేయాలి..
యూజీసీ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌ వయసు పెంపు 65 ఏండ్ల వరకు పెంచుకోవచ్చు. ఈ విషయంలో సర్కారు నిర్ణయమే ఫైనల్‌. ఇప్పటికే పలు రాష్ర్టాలు 65 ఏండ్లకు పెంచాయి. మన రాష్ర్టానికి చెందిన కొంత మంది ఆచార్యులు 2021లో దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే అప్పుడు 65 ఏండ్లకు పెంచడం వీలుకాదని ప్రభుత్వం స్పష్టంచేసింది.