ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ యుగం నడుస్తోంది. ఈ పని కావాలన్నా.. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఇట్టే పూర్తైపోతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ అంతా ఆన్‌లైన్ అయిపోయింది.
గతంలో మాదిరిగా బ్యాంకుకు వెళ్లడం, క్యూలో నిల్చుని గంటల తరబడి ఎదురు చూడటం వంటి పరిస్థితి లేదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటిల్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో అంతా ఫోన్‌తోనే క్షణాల్లో అయిపోతుంది. అయితే, బ్యాంక్‌కు సంబంధించి ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవాలంటే.. తప్పకుండా ఐడీ, పాస్‌వర్డ్ అనేది ముఖ్యం. అది ఉంటేనే.. మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది. అందుకే ప్రతి బ్యాంకు ఇలాంటి ఆప్షన్‌ను ఇచ్చాయి. ఇవాళ మనం ఎస్‌బిఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానం గురించి తెలుసుకుందాం. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల విషయంలో వినియోగదారులు ఒక్కోసారి తమ పేరు, పాస్‌వర్డ్స్ మర్చిపోతుంటారు. ఎస్‌బిఐ వినియోగదారులు కూడా అలాగే మర్చిపోతే.. ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రెండింటినీ పునరుద్ధరించడానికి ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం..
ఎస్‌బిఐ కస్టమర్లు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవడానికి ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. వీటిని సూచనలకకు అనుగుణంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ లాగిన్ వివరాలను మరచిపోతే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు మీకోసం అందిస్తున్నాం. వాటిని అనుసరించడం ద్వారా మరిచిపోయిన ఐడీ, పాస్‌వర్డ్‌ను తిరిగి పునరుద్ధరించవచ్చు.
1. ముందుగా onlinesbi.com ని సందర్శించాలి. అక్కడ ‘Forgot Use Name’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
2. మీ పాస్‌బుక్‌పై ముద్రించిన 11 అంకెల సిఐఎఫ్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.3. మీ దేశాన్ని
ఎంచుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వివరాలను సబ్మిట్ చేయాలి.
4. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేసి.. ‘కన్‌ఫామ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్‌బిఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ వస్తుంది.
పాస్‌వర్డ్ ఇలా సెట్ చేసుకోండి..
1. మళ్లీ onlinesbi.com వెబ్‌సైట్‌కి వెళ్లి, ‘Forgot Password’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
2. అడిగిన అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. నమోదిత ఇమెయిల్ అడ్రస్‌కు కొత్త పాస్‌వర్డ్ సెండ్ చేస్తారు.
3. ఆ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయాలి. ఆ తరువాత మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి దాన్ని మీకు అనువుగా మార్చుకోండి.