అనుమానాస్పద రీతిలో సచివాలయ ఉద్యోగిని మృతి

అనుమానాస్పద రీతిలో సచివాలయ ఉద్యోగిని మృతి


నంద్యాల జిల్లా నూనెపల్లెలో సచివాలయ ఉద్యోగిని సుధారాణి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు.

నూనెపల్లె: నంద్యాల జిల్లా నూనెపల్లెలో సచివాలయ ఉద్యోగిని సుధారాణి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. నంద్యాల 29వ వార్డు సచివాలయంలో ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లోని స్నానాల గదిలో అనుమానాస్పద స్థితిలో సుధారాణి మృతదేహం ఉంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పింఛన్ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగిని మృతిపై నంద్యాల మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.