Seeds For Cholesterol : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక కొలెస్ట్రాల్ కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది. కనుక ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు మందులను వాడడంతో పాటు ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇప్పుడు చెప్పే విత్తనాలు మనకు ఎంతో సహాయపడతాయి. ఈ విత్తనాల్లో ఫైబర్ తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటిని లిన్సీడ్స్ అని కూడా అంటారు. ఈ గింజలల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవిమనకు ఎంతో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో చియా విత్తనాలు కూడా ఎంతో దోహదపడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడుకొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. అలాగే జనపనార విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రోటీన్ తో పాటు గామా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో గుమ్మడి గింజలు కూడా చక్కగా పని చేస్తాయి. ఈ గింజలల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.
కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. నువ్వులకు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది. వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఇక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ఇ తో పాటు మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరం మొత్తానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.