BREAKING: రైతు భరోసా పథకంపై సర్కార్ సంచలన నిర్ణయం

www.mannamweb.com


రైతు భరోసా (రైతు బంధు పాత పేరు) పథకంపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల సూచనలతో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ ఖరారు చేస్తోందని క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుండి కూడా సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.

జూలై 15వ తేదీ లోపు సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని.. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంతో పేరుతో ఎకరాకు రెండు దఫాల్లో రూ.15 వేలు ఆర్థిక సహయం అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వగా.. కాంగ్రెస్ సర్కార్ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రైతు భరోసా స్కీమ్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది