చాలా మంది నిద్ర లేవగానే చాలా నీరసంగా ఉంటారు. ఏ పని చేయలేరు. అసలు కొంత మందికి అయితే… పొద్దుటే నిద్ర లేచే అలవాటే ఉండదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడుతుంటారు.
అయితే.. మార్నింగ్ ఏడు గంటల లోపే లేచి.. ఈ ఏడు పనులు చేసినట్లుయితే మంచి ఆరోగ్యం మీ సొంత అంతుంది.
1. నిద్ర లేవగానే ముందుగా నీరు తాగాలి. దీని ద్వారా రోజంతా ఎంతో తాజాగా ఉంటుంది.
2. లేవడంతోనే ఫోన్, సిస్టమ్, టీవీ చూసే అలవాటు ఉంటే.. ఆ అలవాటును వెంటనే విడిచి పెట్టండి.
3. 20 నిమిషాల పాటు వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం బలంగా ఉండి రోజంతా యాక్టీవ్‌గా పనులు చేసుకోగలుగుతారు.
4. 10 నిమిషాలు ధ్యానం: ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
5. ప్రార్థన లేదా పుస్తకం చదవడం వంటి మంచి పనులతో మీ రోజును ప్రారంభించండి.
6. మీరు చేయబోయే పనులను ముందే ప్లాన్ చేసుకోండి. దీని వల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా మీ పనులు సాఫీగా జరుగుతాయి.
7. చాలా మంది తిన్నాక స్నానం చేస్తారు. అలా చేస్తే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి తినడానికి ముందు స్నానం చేయండి.