Sex Harassment Row: ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ

www.mannamweb.com


లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీయూ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 2019లో హాసన్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ప్రజ్వల్ రేవణ్ణ ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల కేసును విచారించే ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు రేవణ్ణ త్వరగా హాజరుకావాలని, అతను హాజరుకాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉందని సూచించారు. ఇదిలా ఉంటే దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావడానికి ఏడు రోజుల సమయం కావాలని అతను చేసిన అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. రేవణ్ణ ఇంట్లో వంట మనిషిగా పనిచేశానని చెప్పిన మహిళ.. జేడీఎస్ ఎంపీ తన కూతురిని వీడియో కాల్స్ ద్వారా వేధిస్తున్నాడని ఆరోపించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన భారీ విజువల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

మరోవైపు ఎన్నికల సీజన్‌లో ఈ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఎన్నికల కోసం జేడీఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలతో బీజేపీపై కాంగ్రెస్ సర్వత్రా దాడికి దిగింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్ తీవ్ర కలకలం రేపింది. వందలాది వీడియోలు దాంట్లో ఉన్నాయి. పలువురి అమ్మాయిలతో ప్రజ్వల్ ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇక మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. నిందితుడ్నికఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.