మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబానికి చెందిన ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు రాజకీయ లెక్కలను తారుమారు చేస్తోంది. దీంతో ఇన్నాళ్లు రాజకీయాలు చేసిన మాజీ ప్రధాని దేవెగౌడతో సహా మొత్తం ఆయన కుటుంబానికి నల్లమచ్చగా మిగిలిపోయింది. రానున్న రోజుల్లో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఫ్యామిలీకి ప్రజ్వల్ రేవణ్ణ అమావాస్యను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు హాసన్ జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉన్న దేవేగౌడ కుటుంబానికి సంబంధించిన అన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల కేసు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబానికి, జేడీఎస్ పార్టీకి చాలా ఇబ్బంది కలిగించడమే కాకుండా కూటమిగా ఏర్పడిన బీజేపీకి కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కామ్ కేసును బీజేపీ నేతలు సమర్థించలేక, అటు ఖండించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి తారుమారు అవుతోంది కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని ఎదిరిస్తూనే బీజేపీతో అధికారం పంచుకుని, ఆ తర్వాత అదే బీజేపీకి దూరంగా ఉండి రాజకీయాలు చేసిన హెచ్‌డీ దేవెగౌడ తరువాత కాంగ్రెస్ తో దోస్తి కట్టారు. దేవేగౌడ అంటేనే కుటుంబం రాజకీయాలు అని అనేక ఆరోపణలు వచ్చాయి. మాజీ ప్రధాని దేవేగౌడ కుమారులు హెచ్‌డీ రేవణ్ణ తన భార్యాపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా మొత్తం హాసన్‌లో రాజకీయంగా ఆయనే ప్రభావం చూపించే స్థాయికి ఎదిగారు. AD హాసన్ జిల్లా ప్రజలు కూడా ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతు ఇచ్చి ఆయన్ను గెలిపించారు. మాజీ ప్రధాని దేవెగౌడ ఆయన మనవళ్లు ప్రజ్వల్ రేవణ్ణ, నిఖిల్ కుమారస్వామి కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే కోరికతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఆయన మనవళ్లను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అంటే ఎక్కువ అభిమానం ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ ఆయన రాజకీయ జీవితం కూడా త్యాగం చెయ్యడానికి సిద్దం అయ్యారు.
చాలా సంవత్సరాలు పోటీ చేసి గెలిచిన హాసన్ నియోజకవర్గాన్ని మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం వదిలిపెట్టిన మాజీ ప్రధాని దేవేగౌడ తరువాత ఆయన తుమకూరు వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీఎస్, కాంగ్రెస్ పొత్తు కారణంగా బీజేపీని జేడీఎస్ వ్యతిరేకించింది. దీనికి తోడు దేవెగౌడ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. అంతే కాకుండా దేవేగౌడ ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా హిందూ సంస్థలను రాజకీయంగా అవమానించడం ప్రారంభించారు.
వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకోగా, తుమకూరులో దేవెగౌడ ఓడిపోయారు. కానీ ప్రజ్వల్ రేవణ్ణ దేవెగౌడ కుటుంబానికి చెందిన వారసుడు కాబట్టి హాసన్‌లో విజయం సాధించారు. ప్రజ్వల్ రేవణ్ణ దేవెగౌడ రాజకీయ జీవితంలో దిమ్మతిరిగేలా చేసినా ఆయన్ను హాసన్ నియోజకవర్గ ప్రజలు వదల్లేదు. అలాంటి హాసన్ నియోజకవర్గాన్ని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు గత లోక్ సభ ఎన్నికల సమయంలో సీటు ఇచ్చారు. ఏదో ఒక రోజు తన మనవడు ఢిల్లీ స్థాయిలో తన పేరును కాపాడుతాడనే ఆశతో మాజీ ప్రధాని దేవేగౌడ ఇంతకాలం ఉన్నారు. అయితే సెక్స్ స్యాండల్ కేసుతో దేశంలోనే తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ ఫేమస్ అయిపోతాడని మాజీ ప్రధాని దేవేగౌడ ఊహించి ఉండరని జేడీఎస్ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దెబ్బకు జేడీఎస్ తో ఎన్డీఏ అతి త్వరలోనే తెగతెంపులు చేసుకుంటుందని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది