మెట్రో ప్రయాణికులకు షాక్.. అవన్నీ రద్దు చేస్తూ నిర్ణయం..

www.mannamweb.com


హైదరాబాద్ మెట్రో వచ్చాక ప్రజా రవాణా ఎంతో సులభమైన విషయం తెలిసిందే. పైగా ప్రభుత్వం మెట్రో విస్తరణ పనులను వేగవంతం కూడ్ చేస్తున్నారు. ఈ మెట్రో సర్వీస్ వల్ల నగరంలో ప్రజలకు ప్రయాణం ట్రాఫిక్ తిప్పలు లేకుండా సులభంగా జరుగుతోంది. పైగా ఇది ఎండాకాలం కావడంతో మెట్రో ప్రయాణానికి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకిచ్చింది. మెట్రో ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మెట్రో ప్రయాణికులకు ఇస్తున్న రెండు రాయితీలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వార్త విన్న తర్వాత మెట్రో ప్రయాణికులు షాకవుతున్నారు.

హైదరాబాద్ మెట్రో మధ్యలో కొంత డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. పైగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉండనే ఉంది. అయితే ప్రయాణికులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మెట్రో కొన్ని రాయితీలను అందిస్తూ ఉంటుంది. వచ్చే ప్రయాణికులు తక్కువ ధరకే తమ గమ్యస్థానాలు చేరేందుకు వీలుగా ఈ రాయితీలు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు బస్సులు, వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో ప్రయాణమే సౌకర్యవంతంగా భావిస్తున్నారు. అందుకే మెట్రో ప్రయాణానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకునే పనిలో హైదరాబాద్ మెట్రో పడినట్లు కనిపిస్తోంది.

అధిక రద్దీ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఉన్న రెండు రాయితీలను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రూ.59 హాలిడే కార్డు ఉంటుంది. ఆ హాలిడే కార్డు సదుపాయాన్ని ఇక నుంచి రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మెట్రో ప్రయాణంలో ప్రయాణికులకు ఇచ్చే 10 శాతం రాయితీని కూడా రద్దు చేసేందుకు హైదరాబాద్ మెట్రో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రద్దు నిర్ణయాలు మెట్రో ప్రయాణంపై ప్రభావం చూపుతాయా అంటే? ఏమాత్రం చూపవనే చెప్పాలి. ఎందుకంటే ఇంతటి విపరీతమైన ఎండల్లో ఎవరూ బైకులపై ప్రయాణం చేయాలి అనుకోరు. మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులు కచ్చితంగా రద్దీగా ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కచ్చితంగా మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే.. మెట్రో కూడా ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.