బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు అక్కాచెల్లెల్లు! చివరికి!

www.mannamweb.com


బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు బయలు దేరారు ముగ్గురు అమ్మాయిలు. ఇంట్లో ఓ లెటర్ కూడా రాశారు. తమ కోసం వెతకొద్దని, మూడు నెలల తర్వాత ఇంటికి తిరిగొస్తామని.. కానీ

విశ్వాసం ఉండవచ్చు కానీ అంధ విశ్వాసం ఉండకూడదు. ఇదే మూఢత్వంగా మారిపోతుంది కొన్ని సార్లు. మూఢత్వం మనస్సును ఆలోచింపనివ్వకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన మాటున అంధ విశ్వాసాలకు బలౌతున్నారు. చదువులేని వాళ్లు కాదు.. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైతం ఇదే దారిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల జీవితాలను చిధ్రం చేసింది ఇదే అంధ విశ్వాసం. బాబా పిలుస్తాడని, ఆధ్యాత్మిక చింతనలో బతికేస్తూ.. హిమాలయాలకు వెళ్లానని ఇంట్లో ఓ ఉత్తరం ముక్క రాసి పరారయ్యాడు ఈ బాలికలు. వెతికితే.. తాము తిరిగి రామని కూడా బెదిరించారు. అందులో తాము త్వరగానే ఇంటికి వస్తామని చెప్పారు. కానీ నిజంగానే త్వరగానే వచ్చారు సజీవంగా కాదు.. శవాలుగా. కన్న తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచేశారు.

‘బాబా పిలుస్తున్నాడు.. హిమాలయాలకు వెళ్తున్నాం.. మూడు నెలల తర్వాత తిరిగొస్తాం.. ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటాం. ’ అని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అమ్మాయిలు. వీరిది బీహార్ రాష్ట్రం. వీరు ముగ్గురు స్నేహితులు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయా కుమారి స్కూల్ మేట్స్. ఈ ముగ్గురు ఈ నెల 13న ఇంట్లో నుండి పరారయ్యారు. బాబా పిలిచారని, హిమాలయకు వెళ్లాలని, మూడు నెలల తర్వాత అనగా ఆగస్టు 13న తిరిగి ఇంటికి వస్తామంటూ లేఖ రాసి వెళ్లిపోయారు. తమ కోసం పేరెంట్స్ వెతకకుండా.. ఓ బెదిరింపు కూడా చేశారు. తమను వెతికితే.. ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. అయితే అన్నంత పని చేశారు.

ఇప్పుడు మధురలోని బజ్జా బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ పై ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. వీరిని మిస్సైన గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయ కుమారిలుగా గుర్తించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుండి నగరానికి చేరుకుని, వారి తమ కుమార్తెలుగా గుర్తించారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ముగ్గురు అమ్మాయిల మొబైల్ ఫోన్లు మాయమయ్యాయి.అయితే బీహార్ పోలీసులు తమ కేసును సరిగ్గా పట్టించుకోలేదని, లేకుంటే తమ పిల్లలు బతికేవారంటూ ఆరోపిస్తున్నారు బాలికల తల్లిదండ్రులు. స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలు ఖండించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్నామని, బాలికలు స్వచ్చందంగా ఇంటి నుంచి వెళ్లిపోయారని, వారు వెళ్లిపోవడానికి గల కారణాలను వివరిస్తూ లేఖలు రాసి వెళ్లిపోయారని, వారి కోసం వెతుకుతున్నామని, మథురలో మృతదేహాలు లభ్యమైన విషయం తెలియడంతో వారి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు