ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా.. బోర్ సమస్యను ఇలా పరిష్కరించుకోండి

మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నచిన్న అవసరాలకు ప్రధాన వాహనంగా నిలిచేది ద్విచక్ర వాహనం. దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి ఇంట్లోనూ ఏదో ఒక రకమైన ద్విచక్ర వాహనం కచ్చితంగా ఉంటుంది.


గతంలో సైకిళ్లు ఉన్నవారు వాటి స్థానంలో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే వాహనాలు కొనుగోలు చేసిన వారు దానికి సంబంధించిన రిపేర్ వచ్చినప్పుడు చాలా ఖర్చు అవుతుంది. వీటిలో బైక్ ఉన్నవారు అయితే ఒక్కోసారి జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ద్విచక్ర వాహనంలో ప్రధానంగా ఎక్కువగా ఖర్చు అయ్యేది బోర్ వచ్చినప్పుడు. బోర్ కు వచ్చినప్పుడు దాదాపు రూ. పదివేల కంటే ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో చిన్న ట్రిక్ ద్వారా బోర్ ను సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఏదైనా ద్విచక్ర వాహనం బోర్ సమస్య వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సైలెన్సర్ నుంచి ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. అలాగే బండి ముందుకు కదిలే అవకాశం ఉండదు. దీంతో తప్పనిసరిగా మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనం బోర్ కు వచ్చినప్పుడు ఇంజన్ మొత్తం సరి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అంతేకాకుండా కనీసం వారం రోజులపాటు మెకానిక్ షెడ్ లోనే వాహనం ఉండిపోతుంది. అంటే సమయంతో పాటు అధికంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.

అయితే కొంతమంది మెకానిక్ నిపుణులు తెలుపుతున్న ప్రకారం కేవలం చిన్న పని ద్వారా ఈ బోరు సమస్యను పరిష్కరించుకోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ బండి సైలెన్సర్ నుంచి ఎక్కువగా పొగ వస్తుంది అని గమనించినప్పుడు.. ఇంట్లోనే ఈ చిన్న పని చేయాలి. ముందుగా ఒక సిరంజి ద్వారా 5 మిల్లీలీటర్ల పెట్రోల్ తీసుకోవాలి. ఆ తర్వాత బండి మధ్యలో ఉన్న ప్లగ్ ను తీసేయాలి. ఈ ప్లగ్ తీసిన తర్వాత ఇంజన్లో సిరంజి ద్వారా తీసుకున్న ఐదు మిల్లి లీటర్ల పెట్రోల్ను ఇంజన్ లో పోయాలి. ఆ తర్వాత ప్లగ్ ను పెట్రోల్ తో శుభ్రం చేసుకోవాలి.

ఇప్పుడు ఇంజన్ లో ప్లగ్ ను యధావిధి స్థానంలో ఉంచాలి. అయితే ముందుగా ప్రిస్టల్ లోని కిక్కు రాడు కొడుతూ ఉండాలి. ఇలా బైక్ ఆన్ చేయకముందు కొట్టడం వల్ల ప్రిస్టల్ లో ఉన్న కార్బన్ తొలగిపోయి ఫ్రీ అవుతుంది. అంటే అందులోకి పెట్రోలు వెళ్లి సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇంజన్ పై ప్లగ్ ను ఫిట్ చేసిన తర్వాత.. బండి ఆన్ చేసి కిక్ కొట్టాలి. ఇప్పుడు సైలెన్సర్ నుంచి ఎలాంటి పొగ రాదు. అంతేకాకుండా బోర్ సమస్య సెట్ అయిపోయినట్లే. అయితే దీనిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే ఇతర సమస్యలు ఉంటే మాత్రం నిపుణులకు చూపించాల్సిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.