Sorakaya Garelu : సొర‌కాయ‌ల‌తోనూ గారెల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

www.mannamweb.com


Sorakaya Garelu : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో సొర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. సొర‌కాయ‌ల‌తో అనేక ర‌కాల వంట‌ల‌ను చేయ‌వ‌చ్చు. అయితే సొర‌కాయ‌ల‌తో చేసే గారెలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. సొర‌కాయ‌లు అంటే ఇష్టం లేని వారు సైతం సొర‌కాయ గారెల‌ను లాగించేస్తారు. ఇక సొర‌కాయ‌ల‌తో గారెల‌ను ఎలా త‌యారు చేయాలో అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
సొర‌కాయ తురుము – 1 కప్పు, బియ్యం పిండి – ఒక క‌ప్పు, ప‌చ్చి మిర్చి – 2 (స‌న్న‌గా త‌ర‌గాలి), అల్లం తురుము – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, కొత్తిమీర త‌రుగు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

సొర‌కాయ గారెల‌ను త‌యారు చేసే విధానం..
ఒక గిన్నెలో నూనె, బియ్యం పిండి త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను వేసుకుని బాగా క‌ల‌పాలి. త‌రువాత బియ్యం పిండి వేసుకుని మరోసారి క‌లిపి ముద్ద‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మందంగా ఉండే ప్లాస్టిక్ క‌వ‌ర్ లేదా అరిటాకుపైన ప‌లుచటి గారెల్లా అద్దుకుంటూ కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్ర‌గా వేయించుకుని తీసుకోవాలి.