Special accounts for children in SBI…!! ఎస్బిఐ లో పిల్లల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు…!!

www.mannamweb.com


Special accounts for children in SBI…!!

ఎస్బిఐ లో పిల్లల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు…!!

Special accounts for children in SBI…!! ఎస్బిఐ లో పిల్లల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు…!!
దేశంలోనే ఎక్కువ ఖాతాదారులు గల బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అయితే అందిస్తోంది.

వీటిల్లో ప్రత్యేకమైన సేవలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా బ్యాంక్ (Bank) సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు కూడా అందిస్తోంది. రెండు రకాల ప్రత్యేకమైన అకౌంట్లు అందుబాటులో ఉంచింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.

ఎస్‌బీఐ మైనర్లకు పెహ్లా కదమ్, పెహ్లి ఉడాన్ పేర్లతో పిల్లలకు సేవింగ్స్ ఖాతా సేవలు అందిస్తోంది. వీటి ద్వారా మీరు మీ పిల్లలకు పొదుపు గురించి అయితే తెలియజేయవచ్చు. చిన్నప్పటి నుంచే వారికి సేవింగ్స్ అలవాటు చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. ఇది ఊరట కలిగించే విషయం .
పెహ్లా కదమ్, పెహ్లి ఉడాన్ అకౌంట్ సర్వీసులు ద్వారా పొదుపు మాత్రమే కాకుండా పిల్లలకు కొనుగోలు విలువను కూడా తెలియజేయవచ్చని ఎస్‌బీఐ పేర్కొంటోంది. పర్సనల్ ఫైనాన్స్ ఆవశ్యకతను పిల్లలను చిన్నతనం నుంచే తెలియజేయొచ్చు. ఈ అకౌంట్ తెరవడ వల్ల మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు కూడా పొందవచ్చు.

ఈ చిల్డ్రన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే చెక్ బుక్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు.. అకౌంట్ ఓపెన్ చేస్తే 10 చెక్కులతో కూడిన చెక్ బుక్ ఇస్తారు. పిల్లల పేరుపై చెక్ జారీ చేస్తారు. గార్డియన్స్‌కు ఈ చెక్ బుక్ అందిస్తారు. ఇంకా ఏటీఎం కార్డు కూడా లభిస్తుంది. కార్డుపై పిల్లల ఫోటో వస్తుందట.విత్‌డ్రాయెల్ లిమిట్ రూ. 5 వేలు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రోజుకు రూ.2 వేల ట్రాన్సాక్షన్ నిర్వహించొచ్చు.
ఏ వయసులో ఉన్న మైనర్లు అయినా సరే పెహ్లా కదమ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అదే పెహ్లి ఉడాన్ అకౌంట్ అయితే పదేళ్లకు పైన వయసు ఉన్న వారు మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇంకా ఈ అకౌంట్లకు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాల్సిన పని అయితే లేదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు వర్తించే వడ్డీ రేటే వీటికి వర్తిస్తుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్‌బుక్ ఉచితంగానే అందిస్తారట.అలాగే ట్రాన్స్‌ఫర్ ట్రాన్సాక్షన్లకు ఇంటర్ కోర్ చార్జీలు కూడా ఉండవు. మీ పిల్లల పేరుపై ఇంకా అకౌంట్ ఓపెన్ చేయకపోతే.. వెంటనే ఆ పని పూర్తి చేయండి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేయాలి