పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణానికి చెందిన భవిష్య విద్యా సంస్థల అధినేత ఇమడాబత్తిన శ్రీధర్ (50) ఆత్మహత్య చేసుకున్నారు.
రెండు రోజుల క్రితం దేవాలయానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి వెళ్లిన ఆమర విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఆయన భార్య ఉమా కల్యాణి సత్తెనపల్లి పట్టణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద శ్రీధర్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు గుర్తించారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఆదివారం ఉదయం కృష్ణా నదిలో గాలించగా బ్యారేజీ సమీపంలో శ్రీధర్ మృతదేహాన్ని కనుగొని బయటకు తీశారు. మతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శ్రీధర్ మృతికి పలు ప్రయివేటు పాఠశాలల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
































