ఏపీ రాజధాని(AP Capital)లో భూముల కేటాయింపులపై ప్రభుత్వం(Govt) వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తం 7 అంశాలకు ఆమోదం తెలిపేందుకు కసరత్తు చేసింది.
ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub-Committee) సైతం 7 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్(Minister Narayana, CS Vijayanand) సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి(Guntur district Undavalli)లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాజధానిలో భూ కేటాయింపులపై చర్చించారు. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ”అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 7 గ్రామాల్లో అదనపు ల్యాండ్ పూలింగ్‌కు ప్రజలు అంగీకరించారు. అంతేకాదు అటు సీఆర్డీఏ సైతం అనుమతి ఇచ్చింది. కొత్తగా 20,494 ఎకరాల పూలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.” అని పేర్కొన్నారు.