SSC CHSL Notification 2024: ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారికి భారీ శుభవార్త చెప్పింది.
3,712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయస్సు వంటి మొదలైనవి ఇప్పుడు తెలుసుకుందాం..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా 3,712 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎస్ఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 8, 2024న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలో లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షా విధానం, ఫీజు, చివరి తేదీ వంటి మొదలైన విషయాలను కింద తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య
3,712
విభాగాలు
లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ
దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్‌సీ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు
ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు
ఈ పోస్టులకు అప్లై చేయలనుకునే అభ్యర్థుల వయస్సు.. 18 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 08-04-2024
దరఖాస్తు చివరి తేదీ: 04-05-2024
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 10-05-2024 నుంచి 11-05-2024 తేదీల మధ్య మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాన్ని SSC బోర్డు కల్పించింది.
పరీక్షా ఫీజు
సాధారణ అభ్యర్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ కు చెందిన వారికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ మూడు దశలుగా జరగుతుంది.
టైర్-1 పరీక్ష 1 నుంచి 5 & 8 నుంచి 12-07-2024 తేదీల్లో జరుగుతుంది.
టైర్-2 పరీక్షకు సంబంధించిన తేదీలను SSC బోర్డు వెల్లడించలేదు.
టైర్-3లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
అయితే టైర్-1 పరీక్షలో అర్హత మార్కుల సాధించిన వారు మాత్రమే టైర్-2 పరీక్షకు అర్హులవుతారు. టైర్-2 పరీక్షలో కూడా సెలక్ట్ అయిన వారికి టైర్-3 టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు దశల్లో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో కూడా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఉద్యోగం లభిస్తుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ కు అప్లై చేయాలకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.ssc.nic.in వెబ్సైట్ ను సంప్రదించాలి.