ఉదయాన్నే ఈ గట్కా తాగితే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే

www.mannamweb.com


మన దేశంలో చాలా మంది వినియోగిస్తున్న ఆహారధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటితో చేసే వంటలను చాలా మంది చేసుకొని తింటూ ఉంటారు. జొన్న రొట్టెల నుంచి జొన్న బిర్యాని వరకు ఈ జొన్నలతో రకరకాల వంటకాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ జొన్నలతో చేసే గట్కా మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. దీనిని కేవలం నిమిషాల్లోనే చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.

ఈ జొన్న గట్కాను రుచికరంగా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

జొన్న గట్కా తయారీకి కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు జొన్నలు
ఒక కప్పు రేషన్ బియ్యం
ఒక కప్పు పెరుగు
ఒక నిమ్మకాయ
రుచికి సరిపడా ఉప్పు
జొన్న గట్కా తయారీ విధానం

ఈ జొన్న గట్కా తయారు చేసుకోవడానికి మనం ముందు జొన్న రవ్వను పిండి చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు జొన్న, ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని రవ్వ మాదిరిగా చేసుకోవాలి. మరీ పిండి పిండిగా కాకుండా మరీ పెద్ద పెద్ద రవ్వగా కాకుండా మీడియం సైజ్‌లో ఉండే విధంగా రవ్వ చేసుకోవాలి.

ఆ తరువాత ఆ రవ్వను ఒక పాత్రలో వేసుకొని, అందులో గట్కా ఉడికేందుకు సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఆ తరువాత మీడియం మంట మీద ఆ గట్కాను ఉడికించుకోవాలి. నీరు మొత్తం గట్కాకు పట్టుకొని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే జొన్న గట్కా సరిగ్గా ఉడుకుతుంది.

ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గట్కాను కిందకు దించుకోవాలి. కొద్దిసేపటికి గట్కా చల్లబడ్డాక అందులోనే ఒక కప్పు పెరుగు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే గట్కా కొంచెం లూస్ ఉండాలి కాబట్టి కొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి. దీంతో పాటు నిమ్మరసం రసం పిండుకొని ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలి. గట్కా తాగే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. దానిని ఒక గ్లాసులో లేదా ఒక పాత్రలో తీసుకొని తాగితే, రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఎలాంటి మసాలాలు, ఎలాంటి రసాయనాలు లేకుండా ఈ వంటకాన్ని కేవలం నిమిషాల వ్యవధిలోనే చేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు కొన్ని కొన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే షుగర్, బీపీ వంటి రోగాలు రావు. దీంతోపాటు ఇది తొందరగా జీర్ణ అవడం వలన ఎలాంటి జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడం.