సూపర్ హిట్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్.. OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఏలేస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొత్త సినిమా నెల లోపే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, కామెడీ ఇలా అన్ని జోనర్ లో రిలీజ్ అవుతున్న మూవీస్, వెబ్ సీరీస్ భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. మాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు అన్న విషయం గురించి తెలుసుకుందాం.


ఇటీవల చిన్న సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమాలైనా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ సృష్టించింది. చిదంబరం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగు లో ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చింది. అంచనాలకు మించి తెలుగు లో కూడా బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుండటంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ ఈదిగో.. అదిగో అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది.

ఇటీవల మలీవుడ్ లో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లు కూడా భారీగా రాబట్టాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ మంజుమ్మెల్ బాయ్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. వచ్చే నెల మే 3న మలయాళం, తెలుగు తో పాటు మరిన్ని డబ్బింగ్ భాషల్లో స్ట్రిమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాలీవుడ్ లో రూ.200 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా సెన్సేషన్ సృష్టించింది మంజుమ్మల్ బాయ్స్ మూవీ. పరవ ఫిలిమ్స్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువాల్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. మరి థియేటర్లో చూడని వాళ్లు మే 3 న ఓటీటీలో వీక్షించండి.