గులాబ్ జామూన్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ దీంట్లోని మైదాపిండికి భయపడి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి తినడానికి భయపడతారు. అలాంటి వారి కోసం మేము ప్రత్యేకమైన రెసిపీని తీసుకొచ్చాం.
శీతాకాలంలో ఎక్కువగా దొరికే చిలకడదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటితో గులాబ్ జామూన్ తయారు చేసి మీ పండగలు, ప్రత్యేక సందర్భాలను తీపిమయం చేసుకోవచ్చు.
శీతాకాలంలో మార్కెట్లో చిలకడదుంపలు సులభంగా లభిస్తాయి. అలాగే ధర కూడా తక్కువగానే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ సులభంగా దీన్ని తెచ్చుకోవచ్చు. చిలగడదుంపల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. చక్కెర నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. చర్మానికి, కంటి చూపుకు కూడా మంచిది. చాలా మంది దీన్ని హాట్‌గా తినడానికి ఇష్టపడతారు. కానీ దీని సహాయంతో, చాలా వంటకాలను తయారు చేయవచ్చు. చిలగడదుంప గులాబ్ జామూన్ కూడా ఈమధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. మీకు కూడా స్వీట్లు తినడం ఇష్టమైతే, దానిని ఎలా తయారు చేయాలో నేర్చుకోండి.
చిలగడదుంప గులాబ్ జామూన్ తయారీకి కావాల్సినవి:
-చిలగడదుంప
-బెల్లం లేదా పంచదార
-యాలకుల పొడి
-పనీర్
-ఓట్స్ పిండి
-నెయ్యి
గులాబ్ జామూన్ తయారీ విధానం:
ఈ రెసిపీ తయారు చేయాలంటే ముందుగా చిలగడదుంపను ఉడకబెట్టి పక్కక్కు పెట్టుకోవాలి.
తరువాత చక్కెర లేదా బెల్లం తీసుకుని పాకం పట్టాలి. చక్కెర ఆరోగ్యానికి కాస్త హానికరం కనుక బెల్లం ఎంచుకోవడం మంచిది.
ఇప్పుడు పాకం తయారు చేయడానికి పంచదార లేదా బెల్లం, నీటి సరైన సమాన నిష్ఫత్తిలోనే తీసుకోవాలని గుర్తుంచుకోండి. నీరు మరిగిన తర్వాత దాంట్లో బెల్లం లేదా చక్కెరను వేసి బాగా మరిగించాలి.
ఈ మిశ్రమాన్ని తీగ పాకం వచ్చే దాకా అంటే చేతి మధ్య పాకం పెట్టి సాగదీస్తే తీగ లాగా సాగాలి. అలా అయ్యాకే స్టవ్ కట్టేయాలి. లేదంటే గులాబ్ జామూన్లు సరిగ్గా రావు.
తర్వాత చిలగడదుంపను తొక్క తీసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఈ మెత్తటి పేస్టులో దీంట్లో తరిమిని జున్ను వేసి కలపాలి.
దీనితో పాటు ఓట్స్ పౌడర్, యాలకుల పొడి కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
చివరిగా దీంట్లో నెయ్యి వేసి మెత్తగా అయ్యేంత వరకూ బాగా కలపాలి.
పిండి అంతా సాఫ్ట్ గా అయిన తర్వాత చిన్న చిన్న ముక్కులుగా తీసుకుని వుండలుగా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. నెయ్యి అయితే గులాబ్ జామూన్ మరింత రుచిగా ఉంటుందని మర్చిపోవద్దు.
నూనె లేదా నెయ్యి వేడిక్కిన తర్వాత పిండి వుండలను తీసుకుని చక్కగా వేయించుకోవాలి.
వీటిని అలాగే తీసుకెళ్లి ముందుగా తయారు చేసుకుని పక్కక్కు పెట్టుకున్న తీగ పాకంలో వేయాలి.
పాకంలో దాదాపు అరగంట నుంచి గంటపాటు నానబెట్టాలి.
అంతే టేస్టీ అండ్ హెల్తీ చిలకడదుంప గులాబ్ జామూన్ తయారైపోయింది.
వీలైతే వీటి మీద చిన్న చిన్న డ్రైఫ్రూట్ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుని తినేయచ్చు.
ఇవి మీ ఇంట్లో వారికి అతిథులకు ఎవరికైనా సరే బాగా నచ్చుతాయి. ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. ఆరోగ్యం గురించి కూడా భయపడాల్సిన పని ఉండదు.
చిట్కా:
కొందరు తాము తయారు చేసిన గులాబ్ జామూన్లు చిరిగిపోతున్నాయని ఫిర్యాదు చేస్తారు. ఇది మీకు కూడా సంభవిస్తే, గులాబ్ జామూన్ మిశ్రమాన్ని అరచేతిలో బాగా గుజ్జు చేయడం అవసరం అని గుర్తుంచుకోండి.