ఏపీలో తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తన స్టేషన్ లోనే తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. తాజాగా ఈ ఆత్మహత్యకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కే చెందిన సదరు సన్నిహితుడితో తన సమస్యను చెప్పుకుని కంటతడి పెట్టారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇందులో తోటి ఉద్యోగులు ఇద్దరిపై మూర్తి సంచలన ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది.
తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. విజ్జి (తన భార్య), పిల్లలను తలుచుకుంటే బాధేస్తోందంటూ మూర్తి కన్నీరుపెట్టారు.
తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన
మూర్తి మాటలు విన్న సహచరుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని పాజిటివ్ గా ఆలోచించాలన్నారు.
ప్రాణం తీసుకునేంత పెద్ద సమస్య కాదు. నువ్వు లేకుంటే నీ భార్యాపిల్లలను ఎవరు చూస్తారని చెబుతున్నట్లుగా ఉంది. అయితే, నేను వెళ్లలేను, నా వల్ల కావడం లేదంటూ మూర్తి కంటతడి పెట్టారు. చివరకు ఆత్మహత్యకు చేసుకుని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాడు.