పాలతో టీ, కాఫీ కాదు – ఇదొక గ్లాసు తాగండి – రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు

టైంపాస్‌ స్నాక్స్‌గా పాప్‌కార్న్‌ గుర్తొస్తుంది. నేడు ఫూల్‌ మఖానా కూడా ఆ స్నాక్​ లిస్ట్​లో చేరిపోయింది. తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూ ఇటుగా పాప్‌కార్న్‌ మాదిరిగా కనిపించే ఈ మఖానాలో ఎన్నో రకాల పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎన్నో రకాల స్నాక్ రెసిపీలు చేస్తారు. ఇప్పుడు మనం టీ, కాఫీ బదులుగా తయారు చేసే ఒక హెల్దీ డ్రింక్​ రెసిపీ చూద్దాం. ఈ డ్రింక్ ప్రతిరోజు ఒక గ్లాసు తాగితే ఎంతో ఉత్సాహంగా ఉండచ్చు. మరి సింపుల్​గా ఫూల్ మఖానాతో హెల్దీ డ్రింక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

  • పూల్ మఖానా – కప్పు
  • పాలు – అర లీటర్
  • సబ్జా గింజలు – టేబుల్​స్పూన్
  • డేట్స్​ – 10
  • జీడిపప్పు – 10
  • యాలకులు – 5
  • తయారీ విధానం

    • ముందుగా స్టవ్​పై పాన్​​ పెట్టి కప్పు మఖానా వేసి లో ఫ్లేమ్​లో 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి.
    • మఖానా చక్కగా ఫ్రై అయిన అనంతరం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
      • ఇప్పుడు అదే పాన్​లో అర లీటర్ పాలు పోసి మరిగించండి. ​పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
      • డేట్స్​లోని గింజలు తీసేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇందులో బాదం పప్పులు తీసుకోండి. ఇందులో కప్పు గోరువెచ్చని పాలు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
      • ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
      • ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించిన మఖానా, యాలకులు వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి.
      • ఆపై ఇందులో నానబెట్టుకున్న డేట్స్​ని పాలతో సహా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
      • ఆపై పాలను పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి.
      • ఇప్పుడు టీ గ్లాసుల్లోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు టేబుల్​స్పూన్ వేసుకోండి. అలాగే గ్రైండ్​ చేసుకున్న పాల మిశ్రమం పోసి పైన డ్రై ఫ్రూట్స్​తో సర్వ్ చేసుకోండి.
      • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అండ్​ హెల్దీ డ్రింక్ రెడీ!

      ఈ డ్రింక్​ని ఉదయాన్నే టీ, కాఫీకి బదులుగా తాగొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత చల్లగా తాగాలనుకునే వారు డ్రింక్​ని రెండుగంటలపాటు ఫ్రిడ్జ్​లో పెట్టి సర్వ్ చేసుకోండి. టేస్టీగా ఉండే ఈ డ్రింక్​ని పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.