Barrelakka: తెలంగాణలో ‘నిరుద్యోగుల మార్చ్‌’.. బర్రెలక్క అరెస్ట్!

www.mannamweb.com


Barrelakka: తెలంగాణలో ‘నిరుద్యోగుల మార్చ్‌’.. బర్రెలక్క అరెస్ట్!

TGPSC: సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా టీజీపీఎస్‌సీ (TGSPSC) కార్యాలయం ముందు దర్నాకు దిగిన ఆమెను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బలవంతంగా పోలీసు జీపులో ఎక్కిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీఎం రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేసింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని ఆమె డిమాండ్‌ చేసింది

ఈ మేరకు తెలంగాణ నిరుద్యోగులు గ్రూప్‌ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటింపు, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, జీవో 46 రద్దు లాంటి డిమాండ్లతో నిరసనకు దిగారు. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అండగా నిలిచిన బర్రెలక్కను పోలీసులు అరెస్ట్‌ చేశారు.