కానీ సినిమా చూస్తే మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ని అసలు నితిన్ ఎలా ఒప్పుకున్నారు అంటూ కూసింత ఘాటుగానే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అసలు నితిన్ లాంటి హీరోని ఎందుకు వాడుకోలేకపోతున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్..?? అంటూ చాలామంది అభిమానులు మండిపడుతున్నారు . నితిన్ గత తాలూకా సినిమా ట్రాక్ రికార్డ్ ని గుర్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎప్పుడు నితిన్ తో ఓకే ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీలు తెరకెక్కిస్తున్నారు..అని డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించడానికి ట్రై చేయండి అని సజెస్ట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా హీరో నానితో కంపేర్ చేస్తూ నాని ఎలా సినిమా సినిమాకి తన కాన్సెప్ట్ సినిమా స్టోరీస్ చూస్ చేసుకుంటున్నారో అదేవిధంగా నితిన్ కూడా తన స్టైల్ మార్చేసుకుంటే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు నితిన్ కూడా ఈ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది .
ఇకపై తన సినిమాలన్నీ ఫామిలీ సెంటిమెంట్ మూవీస్ కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలు గా ఉంటే బెటర్ అంటున్నారు. చూడాలి మరి నితిన్ తన ఫ్యాన్స్ సజెషన్ ని ఎలా తీసుకుంటాడో..?? నిజానికి తమ్ముడు సినిమాలో నితిన్ పర్ ఫామెన్స్ బాగుంది. కానీ కధ-కాన్సెప్ట్ బాగాలేదు అంటూ జనాలు మాట్లాడుకున్నారు. దీంతో నితిన్ లో టాలెంట్ ఉంది కానీ..మన డైరెక్టర్ వాడుకోవట్లేదు అంటూ జనాలు ఘాటుగానే డైరెక్టర్ పై మండిపడుతున్నారు. కొంతమంది నితిన్ ని కూడా బ్లేం చేస్తూ వచ్చారు. నువ్వు నీ కెరియర్ పై ఫోకస్ చేయాలి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. కాగా నితిన్ కూడా ఇక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కాకుండా..కాన్సెప్ట్ ఫిలింస్ చేయాలి అని డిసైడ్ అయ్యారట. కొంత మంది ఇన్నాళ్లకి నితిన్ కి బల్బ్ వెలిగిందా అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు..!!