పింఛన్ దారులకు షాకిచ్చిన ముఖ్యమంత్రి.. ఇకపై వారికి పింఛన్ లేనట్లే!

పింఛన్ దారుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.


ఈ పింఛన్లలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆధార్‌లో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిపారు.

ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని.. ఇది సరైన పద్ధతి కాదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్ని రకాల అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయని అన్నారు.

ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందిగా అర్హులైన వారికి మాత్రం పింఛన్లు రాకుండా ఆపినట్లు గుర్తించారు. ఇక బాధ్యులైన అధికారులను కూటమి సర్కారు గుర్తిస్తుంది. పింఛన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.