అదిరిపోయిన రాజా సాబ్ టీజర్.. రెబల్ ఫ్యాన్స్‌కు పూనకాలే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు హారర్ కామెడీ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అదే రాజా సాబ్. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి  సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది.. అలాగే కల్కి సినిమా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ గా రానున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు అందాల భామలు నటించనున్నారు.


రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. బాబోయ్ రాజా సాబ్ టీజర్ అదిరిపోయింది. ప్రభాస్ లుక్స్ మాములుగా లేవు..  ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

ప్రభాస్ మొదటి సారి హారర్ కంటెంట్ ఉన్న కథతో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ టైమింగ్, విజువల్స్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజరే ఈ రేంజ్ లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో.. అలాగే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే కల్కి 2 సినిమాలోనూ నటిస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.