పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫీజు షెడ్యూల్ వచ్చేసిందోచ్‌.. ముఖ్యమైన తేదీలు ఇవే

 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ తాజాగా టెన్త్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ప్రకటించారు. 2026 మార్చిలో పది పరీక్షలు జరగనున్న

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ తాజాగా టెన్త్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ప్రకటించారు. 2026 మార్చిలో పది పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి 2025-26 పదో తరగతి చదువుతున్న విద్యార్ధులతోపాటు గతంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. ఈ విద్యార్థులందరూ గురువారం (అక్టోబర్ 30) నుంచి నవంబర్‌ 13వ తేదీ వరకు ఎలాంటి అలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఎస్‌ఎస్‌, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షలకు రెగ్యులర్‌, ఫెయిల్‌ అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఫీజు కట్టేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.


రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్‌ 15 నంచి 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 నుంచి 11 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నంచి 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక విద్యార్ధులు చెల్లించవల్సిన ఫీజుల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.

రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల కలిపి రూ.110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని సూచించారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.60గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వీరు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. మిగతా విద్యార్ధులందరూ ఆయా స్కూళ్లలోని ప్రిన్సిపల్‌లకు ఫీజు అందజేయాలని ప్రకటనలో తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.