రూమ్ లో ఒక్కడే బాలుడు.. చిరుతపులి ఎంట్రీతో!…. VIDEO చూడండి.

www.mannamweb.com


సాధారణంగా అడవి జంతువులు అనగానే అందరూ బెబేలెత్తి పోతారు. అలాంటిది చిరుతపులి అంటే ఎలా ఉంటుంది? కానీ, చిరుతను చూసి ఈ కుర్రాడు చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే.
గతంలో అడవి, ఊరు వేరు వేరుగా ఉండేవి. కానీ, ఇప్పుడు పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న గ్రామాలు, పట్టణాల వల్ల అడవేదో.. ఊరేదో తెలుసుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే అడవిలో ఉండాల్సిన జంతువులు కూడా ఇళ్లకు వచ్చి పలకరించి పోతున్నాయి. సింహాలు, పులులు, చిరుతలు ఊర్లలోకి, ఇళ్లలోకి చొరబటం చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే వెలుగుచూసింది. పైగా ఈసారి అక్కడుంది 12 ఏళ్ల బాలుడు. కానీ, ఆ కుర్రాడి తెలివి చూస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.
ఊర్లలోకి, ఇళ్లలోకి అడవి జంతులు రావడం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అలా వచ్చినప్పుడు జనంతో చేతిలో వాటికి గాయాలు కావడం, వాటి వల్ల ప్రజలకు గాయాలు కావడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఒక ప్రమాదమే జరిగేది. మహారాష్ట్రలోని మాలేగావ్ లో ఓ గదిలో 12 ఏళ్ల కుర్రాడు కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక చిరుతపులి దర్జాగా గదిలోకి నడుచుకుంటూ వచ్చింది. సాధారణంగా ఒక పెద్ద సైజు పిల్లిని చూస్తేనే వణికిపోయే వాళ్లు ఉన్నారు. అలాంటిది చిరుతను చూస్తే ఇంకేమైనా ఉందా. ఎంతో బలంగా, చూస్తేనే పై ప్రాణాలు పైనే పోయేలా ఆ చిరుత ఉంది. కానీ, ఆ బుడ్డోడు మాత్రం ఏమాత్రం తొణకుండా, బెణకకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. చిరుత మెల్లగా లోపలికి వెళ్లగానే బయటకు వచ్చేసి తలుపు లాగేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ ఆ కుర్రాడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అసలు అక్కడ ఏం జరిగిందంటే.. మాలెగావ్ శివార్లలోని నాంపూర్ రోడ్డులో ఒక వెడ్డింగ్ హాలు ఉంది. ఆ వెడ్డింగ్ హాలుకి విజయ్ అహిరే అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మార్చి 5న తన 12 ఏళ్ల కుమారుడిని కూడా ఫంక్షన్ హాలుకు తీసుకెళ్లాడు. అయితే అతడిని ఆఫీస్ లో కూర్చోబెట్టి అతను ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఈ కుర్రాడు డోరు దగ్గర సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ సమయంలో మెల్లగా ఒక చిరుతపులి ఆఫీస్ లోకి వచ్చింది. అయితే డోరు పక్కనే ఉన్న మోహిత్ విజయ్ ని ఆ పులి గమనించకుండా లోపలకు వెళ్లిపోయింది. ఈ సమయంలో పిల్లలే కాదు.. పెద్దాళ్లు కూడా భయంతో కేకలు వేస్తారు.
చిరుతను చూసిన మోహిత్ మాత్రం ఎంతో తెలివిగా చప్పుడు కాకుండా పైకి లేచి బయటకు వెళ్లి తలుపు దగ్గరకు వేసేశాడు. అంతేకాకుండా బయటకు రాగానే తన తండ్రికి ఫోన్ చేసి చిరుత వచ్చిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులు, అటవీ అధికారులకు చెప్పడంతో అక్కడికి వచ్చి చిరుతను పట్టుకున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ మోహిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. అతని సమయస్ఫూర్తికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.