ఒక్కోసారి ఇంట్లోని పనుల వల్ల లేదంటే లేటుగా లేవడం వల్ల అస్సలు పని అవ్వదు. అందులోనూ బయట ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది.
ఒక్క అరగంట, గంట లేటు అయినా మొత్తం మారిపోతుంది. ఇలాంటి బిజీ టైమ్‌లో కూడా వంట త్వరగా పూర్తి చేయవచ్చు. అది కూడా రుచిగా చేయవచ్చు. అదేంటా అనుకుంటున్నారా.. ఆలూ కిచిడీ. కిచిడీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల కిచిడీల గురించి తెలుసుకున్నాం. కిచిడీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా ముందు రెసిపీ. ఇంతకు ముందు పెద్దలు కేవలం బియ్యం, పప్పు, బంగాళ దుంపలతో కలిపి కిచిడీ చేసేవారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు కూడా అందుతాయి. మరి ఈ రుచికరమైన ఆలూ కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
ఆలూ కిచిడీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం, ఆలు గడ్డలు, కంది పప్పు, నెయ్యి, పచ్చి మిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండు మిర్చి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, ఆయిల్.
ఆలూ కిచిడీ తయారీ విధానం:
కుక్కర్ గిన్నెలోకి ముందుగా బియ్యం, పప్పు కలిపి శుభ్రంగా తీసుకోవాలి. బియ్యం కప్పు తీసుకుంటే.. పప్పు అర కప్పు తీసుకుంటే చాలు. ఇందులోనే తోట కూర తరుగు, ఆలు గడ్డ ముక్కలు, పచ్చి మిర్చి వేసి మూత పెట్టి ఓ ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా అయితే కాస్త మెత్తగా ఉడుకుతాయి. వేడి చల్లారే వరకు కుక్కర్ పక్కన పెట్టాలి.
ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఎండు మిర్చి వేసి వేగాక.. ఉల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో పసుపు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, వేసి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు ఉడకబెట్టిన అన్నం కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. చివరలో కొద్దిగా కొత్తిమీర వేస్తే సరి. ఎంతో రుచిగా ఉంటే ఆలూ కిచిడీ సిద్ధం.