భూమిపై ప్రతీ చెట్టు, పుట్ట, జంతువు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. దానిని మనం స్వీకరించే విధానంపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వాటిలో గద్ద ఒకటి.
గద్ద జీవన విధానం నుంచి మన జీవితానికి అవసరమైన కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. ఇంతకీ గద్దలో ఉండే ఆ మంచి గుణాలు ఏంటి.? వాటిని అనుసరిస్తే మనం జీవితంలో జరిగే మార్పు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
* గద్దలు ధైర్యానికి చిహ్నంగా నిలుస్తాయి. వేటాడే సమయంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా బెరుకులేకుండా పోరాటం చేస్తాయి. ఆహారం కోసం ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా, దృఢ నిశ్చయంగా ముందుకు సాగుతాయి. అనుకున్న పని సాధించేందుకు ఇలా పట్టుదలతో ఉండాలనే సందేశాన్ని గద్దలు మనకు అందిస్తాయి.
* గద్దలు చురుకైన చూపుకు పెట్టింది పేరు. అత్యంత షార్ప్ ఐపవర్ ఉన్న పక్షుల్లో గద్దలు మొదటి స్థానంలో ఉంటాయి. అలాగే గద్ద చూపు లక్ష్యంపైనే ఉంటుంది. అందుకే సముద్రంలో ఉన్న చేపను కూడా ఎంతో పర్‌ఫెక్ట్‌గా పట్టుకోగలుగుతుంది. గద్ద నుంచి నేర్చుకోవాల్సిన మరో పాయింట్ ఈ ఏకాగ్రతే.
* స్వేచ్ఛ, స్వాతంత్రానికి గద్ద సూచికంగా నిలుస్తుంది. సాధారణంగా అన్ని పక్షులు గుంపులుగా ఎగిరితే గద్ద ఒక్కటే ఒంటరిగా విహరిస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలన్న సందేశాన్ని గద్ద అందిస్తుంది.
* ఇక గద్దలు ఎలాంటి పరిస్థితులనైనా సమానంగా ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రతికూల వాతావరణానికి అనుగుణంగా తమ సామర్థ్యాన్ని మలుచుకుంటాయి. తట్టుకొని నిలబడేందుకు తనను తాను మార్చుకుంటాయి.
* గద్దలు ఏకాగ్రతకు పెట్టింది పేరు. ఆహారాన్ని వేటాడే క్రమంలో గద్దలు డిస్బ్రబ్ కాకుండా ఉండేందుకు ఒంటరిగా ప్రయణిస్తాయి. గుంపులుగా విహరిస్తే.. వచ్చే శబ్ధం కారణంగా వాటి దృష్టి మరలుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇతర వ్యాపాలకు డైవర్ట్ కాకుండా లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేయాలని గొప్ప సందేశాన్ని గద్ద చెబుతోంది.