భారత్‌లో క్యాన్సర్ (Cancer) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మగవాళ్లలో వివిధ రకాల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
భారత్‌లో క్యాన్సర్ (Cancer) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మగవాళ్లలో వివిధ రకాల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. కాలుష్యం, జీవనశైలి మార్పులు, జన్యు కారణాలు ఇందుకు కారణం. చాలా కేసులు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కు చేరుకున్నాక నిర్ధారణ అవుతున్నాయి.
దీంతో ట్రీట్‌మెంట్ కష్టమవుతోంది. అవగాహన, ప్రాథమిక దశలోనే గుర్తించడం, నివారణ చర్యలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి కీలకం. ఇండియాలో పురుషులకు ఎక్కువగా వచ్చే 5 రకాల క్యాన్సర్లు, వాటి లక్షణాలు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
ఊపిరితిత్తుల క్యాన్సర్
లంగ్ క్యాన్సర్ (Lung Cancer) పురుషుల్లో మరణాలకు ప్రధాన కారణంగా ఉంది. స్మోకింగ్ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అయినప్పటికీ.. సెకండ్‌హ్యాండ్ స్మోక్, ఎయిర్ పొల్యూషన్ కూడా వ్యాధి ముప్పును పెంచుతున్నాయి. ఎక్కువ రోజులు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫంలో రక్తం, గొంతు మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మోకింగ్ మానేయడం, పొల్యూటెడ్ ఏరియాల్లో మాస్క్ ధరించడం, హెల్తీ డైట్ తీసుకోవడం, ఇతర అలవాట్లు వ్యాధి ముప్పును తగ్గిస్తాయి.
స్టమక్ క్యాన్సర్
దీని లక్షణాలు సాధారణ జీర్ణ సమస్యలుగా ఉంటాయి, దీంతో వ్యాధిని గుర్తించడం కష్టం. ఆకలి తగ్గడం, తక్కువ ఆహారం తిన్నా కడుపు నిండిన భావన, బరువు తగ్గడం, నల్లని మలం వంటి సంకేతాలు కనిపిస్తాయి. హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధికి ప్రధాన కారణం. స్మోకింగ్, డ్రింకింగ్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం, స్పైసీ ఫుడ్ కూడా కారణాలు. స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం, హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకోవడం అవసరం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం రిస్క్‌ను తగ్గిస్తుంది.
గొంతు క్యాన్సర్
ఆహారం మింగడంలో ఇబ్బంది, బరువు తగ్గడం వంటివి గొంతు క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. మొదట సాలిడ్ ఫుడ్, తర్వాత ద్రవాలు మింగడం కష్టమవుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్, యాసిడ్ రిఫ్లక్స్, వేడి డ్రింక్స్, స్పైసీ ఫుడ్ రిస్క్‌ను పెంచుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. హెల్తీ డైట్, ఆల్కహాల్, స్మోకింగ్ మానేయడం మంచిది.
పెద్దపేగు క్యాన్సర్
కొలొరెక్టల్ క్యాన్సర్ యూత్‌లో కూడా పెరుగుతోంది. రెడ్ మీట్ ఎక్కువగా తినడం, ఊబకాయం, మద్యం, స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్. మలంలో రక్తం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ. ఫైబర్ ఎక్కువగా ఉన్న డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, ఆల్కహాల్ మానేయడం.. వంటివి వ్యాధి ముప్పును తగ్గిస్తాయి.
నోటి క్యాన్సర్
పొగాకు, గుట్కా, పాన్ మసాలా, స్మోకింగ్ వంటివి నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ఆల్కహాల్, ఓరల్ హైజీన్ లేకపోవడం కూడా రిస్క్‌ను పెంచుతాయి. నోటిలో పుండ్లు, తెల్లని లేదా ఎరుపు మచ్చలు, నోరు తెరవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. పొగాకు వాడకం పూర్తిగా మానేయడం, రెగ్యులర్ డెంటల్ చెకప్‌లు, పండ్లు, కూరగాయలు తినడం వంటి జాగ్రత్తలతో ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చు.
































