వెజ్ ఉప్మా.. రవ్వ, రకరకాల కూరగాయలు, మసాలాలతో చేసే ఉప్మా వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది.
అటుకుల ఉప్మా.. ఉల్లిపాయలు, బఠానీలు, ఇతర కూరగాయలు కలిపి చేసే అటుకుల ఉప్మా త్వరగా జీర్ణమవుతుంది.
దీని వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది.
రవ్వ ఇడ్లీ.. రవ్వ ఇడ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.
మసాలా ఓట్స్.. ఓట్స్‌లో క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలు వేసి వండుకుంటే.. రుచిగా ఉండటంతో పాటు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
రాగి మాల్ట్.. రాగితో చేసే ఈ గంజిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీల అల్పాహారానికి ఇది ఒక మంచి ఆప్షన్.
మేతి తెప్లా.. మెంతికూర, గోధుమపిండితో చేసే తెప్లాలో ఫైబర్ అధికంగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది పొట్ట కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
పాలకూర సూప్.. శరీర బరువు తగ్గించడానికి పాలకూర సూప్ ఒక మంచి ఎంపిక. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకునే ముందు దయచేసి ఒకసారి మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.
































